Congress | ఆసక్తికరంగా.. గొల్లపూడి రాజకీయం..
Congress, వైరా, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి మోహన్రావు మర్యాదపూర్వకంగా అమ్మ ఫౌండేషన్ అధినేత మల్లు నందిని విక్రమార్కను కలిశారు. వైరా మండలంలో రాజకీయ పరిస్థితులను గురించి చర్చించారు. రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని.. ఆమె ఆకాంక్షిస్తూ.. మోహన్ రావును శాలువాతో సత్కరించారు.
వైరా మండలంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. మోహన్ రావు, నందిని ప్రత్యేకంగా కలవటం ప్రస్తుతం గ్రామాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. గొల్లపూడి గ్రామ సర్పంచ్ గా తనను గెలిపిస్తే.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని.. పసుపులేటి మోహన్రావు పేర్కొన్నారు. గొల్లపూడి గ్రామంలో నేడో, రేపో మల్లు నందిని విక్రమార్క ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

