Congress | అర్హులందరికీ ఇందిరమ్మఇండ్లు…

Congress | అర్హులందరికీ ఇందిరమ్మఇండ్లు…

Congress | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడల యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Dr. Vakiti Srihari) సహకారంతో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని ఊట్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యగ్నేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు బాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు సూర్య ప్రకాశ్ రెడ్డి, మనెమ్మ గోపాల్ రెడ్డి అన్నారు.

ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు. పేద ప్రజలు గుడిసెల్లో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో నిర్మాణ పనులు పూర్తిచేస్తే దశలవారీగా బిల్లులు మంజూరు అవుతాయన్నారు.

Congress | గతంలో మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా

ఊట్కూర్ మండల కేంద్రానికి 16 ఇందిరమ్మ ఇండ్లు(16 Indiramma Houses), నాగిరెడ్డిపల్లికి 5, ఓబులాపూర్ 4, అవుసలోనిపల్లి 3 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. గతంలో మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల ధ్రువపత్రాలు(certificates) మంజూరు చేసిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీవో కిషోర్ కుమార్, ఎంపివో బాలాజీ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోరం మహేష్, పట్టణ అధ్యక్షుడు కొక్కు లింగం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply