బెల్లంపల్లి 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దావ స్వాతి ప్రచార హోరు..

బెల్లంపల్లి 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దావ స్వాతి ప్రచార హోరు..
- ఎమ్మెల్యే వినోద్ ఆశీస్సులతో వార్డు అభివృద్ధికి కృషి
ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల అభ్యర్థన
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి 7వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి దావ స్వాతి రమేష్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శుక్రవారం వార్డులోని పలు కాలనీల్లో ఆమె విస్తృతంగా పర్యటిస్తూ, గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆమెకు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆశీస్సులతో, వారి సంపూర్ణ సహకారంతో 7వ వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డులో ఏళ్లుగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం, స్వచ్ఛమైన మంచినీటి సరఫరాకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ పట్టణ ప్రగతి కోసం పడుతున్న శ్రమను, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
