చెన్నకేశవ స్వామి ఊరేగింపులో అపశృతి

చెన్నకేశవ స్వామి ఊరేగింపులో అపశృతి
- పలువురికి గాయాలు
- కందనాతిలో కలవరం
ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు(Emmiganur) మండలం, కందనాతి గ్రామంలో అపశృతి చోటు చేసుకుంది. దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన శ్రీ చెన్నకేశవ స్వామి(Sri Chennakesava Swamy) రథోత్సవంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున భక్తులు రథాన్నికొండపైకి లాగుతుండగా, రథం(Ratham) ఆకస్మాత్తుగా పక్కకు ఒరిగి భక్తులపై పడింది.
ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిని తక్షణమే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి(Govt. Hospital) తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఏడాది జరిగే రథోత్సవం ఈసారి విషాద ఛాయలు మిగిల్చింది.
