డ్రైవరు.. కండక్టర్‌కు గాయాలు

డ్రైవరు.. కండక్టర్‌కు గాయాలు

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని కొప్పెడు వద్ద బస్సు(the bus) ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై దిశగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో బస్సు డ్రైవర్(bus driver), కండక్టర్ స్వల్ప గాయాలతో బయటపడగా, బస్సులో ఉన్న ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు.

సత్యవేడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు(30 passengers) ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదంతో కొంతసేపు తిరుపతి–చెన్నై ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు(police) అక్కడికి చేరుకుని వాహనాలను పక్కకు జరిపి రాకపోకలను సాధారణ స్థితికి తెచ్చారు.

Leave a Reply