Tiger | పులి సంచారంతో ఆందోళన..

Tiger | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పోలవరం పరిసర ప్రాంతాల నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. అటవీ శాఖ అధికారులు పులి కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం జిల్లా ప్రాంతం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి పెద్దపులి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఐదు రోజులుగా దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఈ పులి ప్రస్తుతం సీతానగరం మండలం అచ్చయ్యపాలెం, చీపురుపల్లి గ్రామాల సమీపంలో ఉన్నట్లు సమాచారం.
ఇందుకూరు అటవీ శాఖ రేంజ్ అధికారి కొండలరావు మాట్లాడుతూ… ట్రాకింగ్ సిస్టమ్ సహాయంతో పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నామని తెలిపారు. పులి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ సిబ్బంది పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.
