పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

28 లక్షల రూపాయలతో ఎస్సారెస్పీ కార్యాలయానికి కాంపౌండ్ వాల్

రానున్న రోజుల్లో కార్యాలయాన్ని ఆధునికరించేందుకు కృషి

సుల్తానాబాద్, అక్టోబర్ 20 (ఆంధ్రప్రభ): ప్రభుత్వ భూములు అన్యకాంతం కాకుండా పరిరక్షించేందుకు కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయం చుట్టూ 28 లక్షల రూపాయలతో ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, దాదాపు 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎస్సారెస్పీ కార్యాలయం నిర్మాణం జరిగిందని అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ ముందుచూపు ఆలోచనతో ఎస్సారెస్పీ కాల్వల నిర్మాణానికి కృషి చేశారని అన్నారు. ఇది అత్యంత పొడవైన డీ86 కెనాల్ అని ఈ కెనాల్ కింద అత్యధిక ఆయకట్టు ఉందని పేర్కొన్నారు. చివరి భూములకు రైతులకు నీరు అందించేందుకు ఈ కెనాల్ ఉపయోగపడుతుందని ఆయకట్టుకు నీరు అందించేందుకు ఎస్సారెస్పీ అధికారుల కార్యాలయం నిర్మాణం జరిగిందని 40 సంవత్సరాలుగా అభివృద్ధి జరగలేదని, ప్రస్తుతం చుట్టు ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరుకు మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తో చర్చిస్తాన‌న్నారు. రానున్న రోజుల్లో కార్యాలయంలో అధునాతన సౌకర్యాలు ఉన్న భవనాలను ఉపయోగపడే విధంగా నిర్మాణం చేపడతామన్నారు.

సుల్తానాబాద్ మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని ధ్యేయంగా ఉన్నామన్నారు. అన్ని కార్యాలయాల అభివృద్ధికి రానున్న మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపి లక్ష్మి దేవి కటాక్షములు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, పార్టీ శ్రేణులు డి. దామోదర్ రావు, గాజుల రాజమల్లు, పన్నాల రాములు, చిలుక సతీష్, అమీరిశెట్టి రాజలింగం, మార్కెట్ డైరెక్టర్ అప్పల తిరుమల, పడాల అజయ్ గౌడ్, బిరుదు కృష్ణ, కల్లేపల్లి జానీ, కుమార్ కిషోర్, అమీరిశెట్టి తిరుపతి, పొన్నం చంద్రయ్య గౌడ్, మూల సత్యం గౌడ్, దున్నపోతుల రాజయ్య, మహ్మద్ రఫీక్, చింతల రాజు, గాదాసు రవీందర్, టికే ప్రభాకర్, మోబిన్, మేంగాని శ్రీనివాస్, న్యాతరి దేవేందర్, బొల్లం లక్ష్మణ్, దీకొండ శ్రీనివాస్, డిఇ మధుమతి, ఏఈ స్వాతి పాల్గొన్నారు.

Leave a Reply