ఎకరాకు రూ.30 లక్షలు పరిహారం ఇవ్వాలి..

ఎకరాకు రూ.30 లక్షలు పరిహారం ఇవ్వాలి..
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ పట్టణంలోని మఠంపల్లి బైపాస్ రోడ్(Bypass Road)లో వ్యవసాయ కళాశాలకు, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు అఖిలపక్ష రైతుసంఘం ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వినతిపత్రం అందించారు. ఈ రోజు హైదరాబాద్(Hyderabad)లో మంత్రిని బాధిత రైతులతో కలిసిన రైతుసంఘం నాయకులు భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు, బావికి మూడు లక్షలు, బోరుకు రెండు లక్షల పరిహారం, పశువుల కొట్టం, పశువుల జీవులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ మెమోరాండం(Memorandum) ఇవ్వటం జరిగింది. మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ ఇందిరమ్మ ఇల్లు, ప్రతి కుటుంబంలో ఒక జాబు తప్పక ఇస్తానని, వీటితో పాటు ఎకరాకు 30 వేల నష్టపరిహారం విషయంపై ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు కాకి అజయ్, పశ్యపద్మ, కొప్పోజు సూర్యనారాయణ, కంబాల శ్రీనివాస్, ప్రభులింగం నరేంద్రప్రసాద్, దేవరం మల్లేశ్వరి, రైతులు చెన్నగాని సైదులు, పోలగాని సైదులు, పశ్యలక్ష్మి, ఇందిరాల రమేష్, సోమగాని కృష్ణమూర్తి, వారణాసి నాగరాజు, జెనిగ నాగమణి, చెన్నగాని శ్రీను, మామిడి బెంజి, గోసుల నరసింహ, లక్ష్మి, కటారి లింగయ్య, రవి, వెంకన్న వీరమ్మ, సైదులు లింగరాజు పాల్గొన్నారు.
