క్షుద్ర పూజల కలకలం..

కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : మండలంలోని గంగారం గ్రామ శివారు హుస్సేన్ మియా వాగు వద్ద ఆదివారం క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న ఘటన కలకలం రేపింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు చేరుకునే సరికి అక్కడ ఉన్న కొంతమంది పరారయ్యారు. అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలంలో క్షుద్ర పూజలకు ఉపయోగించే బొమ్మలు, నిమ్మకాయలు, దండలు, కోడి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ తదితర పూజా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం రోజుల్లో కొంతమంది క్షుద్ర పూజారులు నిరక్షరాస్యులైన ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షుద్ర పూజలపై అధికారులు నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply