College | ముస్లిం సంఘాల ధర్నా…

College | ముస్లిం సంఘాల ధర్నా…
College | పల్నాడు జిల్లా నరసరవుపేట, ఆంధ్రప్రభ : సత్తెనపల్లి రోడ్డులో ఉన్న మైనారిటీ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించి ముస్లిం సంఘాలు ధర్నా చేపట్టాయి. మైనారిటీ కళాశాలను కేంద్రియా విద్యాలయాలకు కేటాయించాలన్న అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
మైనారిటీ ఆస్తులు కాపాడాలి అంటూ రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి-నరసరావుపేట దారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి నరసరావుపూట తహసిల్దార్ చేరుకున్నారు.
