శభాష్ చైర్మన్ సాబ్….

శభాష్ చైర్మన్ సాబ్….
స్వయంగా పనుల పర్యవేక్షణ
మంథని, ఆంధ్రప్రభ : పదవి బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోపు మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ ప్రజాభిమానాన్ని చూరగొరుతున్నారు. మంగళవారం మంథని పట్టణం జూనియర్ కళాశాల మైదానంలో పారిశుద్ధ్య పనులు స్వయంగా పర్యవేక్షించారు. మంథని మున్సిపాలిటీని చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ వడ్నాల శ్రీనివాస్ వెల్లడించారు. ప్రజా ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రామంలో మున్సిపల్ సిబ్బందితో చెత్త ఎరివేసి కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ…. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మంథని మున్సిపల్ ను రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ద్వారా మున్సిపల్ పరిధిలోని 13 వార్డుల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లోనే రోడ్లను డ్రైనేజీలను సంపూర్ణంగా శుభ్రం చేస్తామన్నారు దోమల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు పారిశుద్ధ్య కార్యక్రమానికి పరిసరాల పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు అన్ని వార్డుల్లో స్ట్రీట్ లైన్లను అప్డేట్ చేస్తామన్నారు మున్సిపల్ పరంగా చేపట్టే ఈ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు పట్టణాన్ని అన్య రంగాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కుర్ర లింగయ్య, ఎల్లంకి వంశీ, వాకర్స్ పాల్గొన్నారు.
