ఏటీసీ పట్ల కలెక్టర్ సంతృప్తి
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్(Kishtapur) గ్రామ సమీపాన ఉన్నఅడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్(Advanced Training Centre) (ఏటీసీ)ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏటీసీ(ATC)లోని ఇంజనీరింగ్ ట్రేడ్ల పరికరాలను, ఇతర వాటిని పరిశీలించి ఇన్స్ట్రక్టర్లను(Instructors), ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాములును వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తరువాత పక్కనే ఉన్నకస్తూర్బా గాంధీ విద్యాలయాన్నిఆయన తనిఖీ(Check) చేశారు. మధ్యాహ్నం భోజనాన్ని ఆయన పరిశీలించి అక్కడే ఉన్నస్పెషల్ ఆఫీసర్ శ్రీవాణిని(Special Officer Srivani) విద్యార్థుల బాగోగులు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పనితీరు పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.