కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: దేశ రక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న సాయుధ దళాల కుటుంబాల సంక్షేమం కోసం ఫ్లాగ్ డే నిధికి విరివిగా విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పీజీఆర్ఎస్ లో జరిగిన సమావేశంలో అధికారులను సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా సైనిక్ వెల్ఫేర్ ఫండ్‌కు రూ.10,000 విరాళం ప్రకటించారు.
ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి తమ వంతుగా ఆర్థిక సహాయం చేయాలని, దేశం కోసం సైనికులు చేస్తున్న త్యాగాలకు కృతజ్ఞతగా ఫ్లాగ్ డే ఫండ్‌కు విరాళాలు అందించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, కొండయ్య, సైనిక సంక్షేమ అధికారి రత్న రూత్ తదితరులు పాల్గొన్నారు.

