గుంటూరు, ఆంధ్రప్రభ : శంకర్ విలాస్ ఆర్వోబీ (Shankar Vilas RVOB) పనులను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా (Collector A Tamim Ansaria) శనివారం పరిశీలించారు. జీజీహెచ్ వద్ద నుండి బ్రాడీపేట , అరండల్ పేట వరకు జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. ఆర్వోబీ పనులతో ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదురు అవుతుందని దృష్టికి రావడంతో పనులను పరిశీలించారు.
త్వరితగతిన పనులు పూర్తి కావడానికి అవసరమగు చర్యలను అడిగి తెలుసుకున్నారు. రూ.98 కోట్లతో 930 మీటర్లు పొడవున ఆర్వోబీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పనులు సకాలంలో పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. రహదారులు, భవనాల శాఖ కార్యనిర్వహక ఇంజనీర్ సి.విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ బ్రాడిపేట వద్ద కొంత స్థలం క్లియర్ కావలసి ఉందని, అది పూర్తి అయితే నిర్మాణానికి ఎటువంటి ఆటంకం లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో రహదారులు, భవనాల శాఖ డీఈ డి. చిన్నయ్య, ఏఈ వి. సాయి కృష్ణ, లక్ష్మీ ఇన్ ఫ్రా డెవలపర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.