Collector | రోగులకు సరైన వైద్యం అందుతుందా..?

Collector | రోగులకు సరైన వైద్యం అందుతుందా..?
Collector | ఆసుపత్రి సేవలపై రోగులతో మాట్లాడిన కలెక్టర్
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి.
ఎక్స్‌రే, డయాలసిస్ సేవలు త్వరగా ప్రారంభించాలి
100 పడకల ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలి
పట్టణ కేంద్రం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
స్టేషన్ ఘన్‌పూర్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విస్తృత పర్యటన
Collector | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్, నిర్మాణంలో ఉన్న 100పడకల ఆసుపత్రి, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలను ఆయన సందర్శించారు. మొదటగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సంద ర్శించి ఆసుపత్రి పరిసరాలు, మందుల లభ్యత, టాయిలెట్లు, వార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసారు. ప్రతి వార్డు పరి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

అవసరమైన మందులు ఎప్ప టికప్పుడు అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులకు సూచించా రు. ముఖ్యంగా శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఆదేశిం చారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలుసు కుని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి సరైన వైద్యం అందుతుందా..? డాక్టర్లు సమయానికి అందుబాటులో ఉంటు న్నారా అనే విషయాలను రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలను వెంటనే ప్రారంభించాలి. డయాలసిస్ సేవలను కూడా వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

100 పడకల ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్:
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి, ఇంకా పెండిం గ్‌లో ఉన్న పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.

నిర్లక్ష్యం చేస్తే వహిస్తే సహించను: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
చివరగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. అక్కడి ప్రతి గది నిర్వహణను స్వయం గా పరిశీలించారు. కార్యాలయ నిర్వహణను క్రమబద్ధంగా ఉంచాలి. ప్రజలకు సేవలు అందించే కార్యాలయం పరిశుభ్రంగా ఉండెలా చూసు కోవాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే వహిస్తే సహించనని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ వినయ్ కుమార్, వైస్ చైర్‌పర్సన్ నీల రాజమ్మ,వార్డు సభ్యు లు కలెక్టర్‌ను మర్యాద పూర్వక కలిసారు. ఈ సందర్బంగా వారికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్క రించేలా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆర్అండ్ బి అధికారులు, స్టేషన్ ఘన్ పూర్ మున్సి పల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

