22ఎ భూ సమస్యలు పరిష్కరించాలి

22ఎ భూ సమస్యలు పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం,ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో ఉన్న 22ఎ భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్లతో వర్చువల్ గా జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి 22ఎ పై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎన్ని సమస్యలు పెండింగులో ఉన్నాయని మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు.

22ఎ సమస్యలు ఎన్ని పరిష్కారం అయ్యాయి, ఎన్ని పెండింగులో ఉన్నదీ ఆయన అడిగి తెలుసుకున్నారు. పెండింగులో ఉన్న 22ఎ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, ఆయా విభాగాల పర్యవేక్షులు రామమూర్తి, రాజేశ్వరరావు, సురేష్, కామేశ్వరరావు, డిటీలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply