Collector | మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Collector | మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Collector | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని షాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక మెగా మెడికల్ క్యాంపు శిబిరాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి ష సందర్శించి పరిశీలించారు. వైద్య శిబిరంలో వైద్య అధికారులు చేస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించి వైద్యాధికారులతో మాట్లాడారు.

శిబిరానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, ఏజెన్సీ అదనపు వైద్య అధికారి కుడిమెత మనోహర్, ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ఉపేందర్ జాదవ్, షాంపూర్ వైద్యాధికారి రాథోడ్ సందీప్, రిమ్స్ ఆస్పత్రి వైద్య అధికారులు, స్థానిక వైద్య ఉద్యోగులు, ఆశా వర్కర్లు, రోగులు, ప్రజలు పాల్గొన్నారు.

Collector |
Collector |

CLICK HERE TO READ MORE : ఉట్నూర్ ఐటీడీఏ ఏపీవోగా ఆత్రం భాస్కర్

CLICK HERE TO READ MORE

Leave a Reply