Collector | రేపు నాగర్ కర్నూల్ లో మంత్రి దామోదర పర్యటన

Collector | రేపు నాగర్ కర్నూల్ లో మంత్రి దామోదర పర్యటన

Collector | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో సోమవారం (రేపు) రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నరని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఇవాళ‌ తెలిపారు.

మంత్రి సోమవారం ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు నాగర్‌కర్నూలు చేరుకుంటారని తెలిపారు.ఈ సందర్భంగా నాగర్‌కర్నూలు పట్టణంలోని యెండబెట్ల వద్ద కేసరి సముద్రం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి, ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి, నాగర్‌కర్నూల్ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు (రూ.20 కోట్ల విలువైన)శంకుస్థాపనలు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు నాగర్‌కర్నూలు నుండి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేసి సాయంత్రం 4.00 గంటలకు అక్కడికి చేరుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పర్యటన సందర్భంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ప్రోటోకాల్ అమలు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply