Collector | ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యం

Collector | కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ (ప్రజల అభిప్రాయం) విషయానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశంలో మరింత పురోగతి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. ఈ రోజు కలెక్టర్ ఛాంబర్ లో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశం పై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కి సంబంధించి ఆర్ ఓ ఆర్ కేసులలో, ఎఫ్ లైన్ పిటిషన్ లలో ప్రొసీజర్ ను పాటించి ప్రజల నుండి మంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని రావాలని కలెక్టర్ కర్నూలు, పత్తికొండ, ఆదోని ఆర్డీఓ లను ఆదేశించారు… రెవెన్యూ క్లినిక్ లో వచ్చిన అర్జీలలో వెంటనే పరిష్కరించే సమస్యలు ఉంటే ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ కర్నూలు, పత్తికొండ ఆర్డీఓ లను ఆదేశించారు. జనవరి 27వ తేదీ నాటికి రెవెన్యూ క్లినిక్ లో వచ్చిన అర్జీలను పరిష్కరించాలన్నారు..

పెన్షన్ పంపిణీలో ప్రజల నుండి సానుకూల స్పందన బాగుందని మరింత సానుకూల స్పందన సాధించేందుకు కృషిచేయాలని కలెక్టర్ డీఆర్డిఏ పీడీని ఆదేశించారు. దీపం 2 పథకంకు సంబంధించి ఐవిఆర్ఎస్ కాల్ ఫీడ్ బ్యాక్ లో జిల్లా పురోగతి వెనుకబడి ఉందని, ఈ అంశంలో పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ డిఎస్ఓను ఆదేశించారు.

బస్ స్టేషన్ లో నీటి సౌకర్యం, పారిశుధ్యం, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లో పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ ఆర్టీసీ ఆర్ఎమ్ ను ఆదేశించారు. అన్ని పంచాయతీలలో ఇంటి ఇంటికి వెళ్లి పారిశుధ్యం సిబ్బంది చెత్త సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీపీఓను ఆదేశించారు. వైద్యులు అందుబాటులో ఉండాలని, మందులకు బయటి పంపకుండా అన్నీ అందుబాటులో పెట్టుకోవాలని, పారిశుధ్యం పనులు సక్రమంగా జరగాలని, స్టాఫ్ నర్స్, ఇతర ఏ సిబ్బంది కూడా పేషెంట్ వద్ద నుండి డబ్బులు వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని తద్వారా ప్రజల నుండి సానుకూల స్పందన మరింత పెరిగే అవకాశం ఉంటుందని కలెక్టర్ డిఎంహెచ్ఓ ను ఆదేశించారు.

ఇరిగేషన్ శాఖ కూడా పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లో పురోగతి తీసుకొని రావాలన్నారు. వసతి గృహాలలో పారిశుధ్యం, నీటి సౌకర్యం, వార్డెన్ పని తీరు మెరుగుపరిచి పురోగతి కనపర్చాలని బీసీ, మైనారిటీ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ కూడా వారికి సంబంధించిన అంశాల్లో పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పిడి చిరంజీవి, ఐసిడిఎస్ పిడి విజయ, డి పి ఓ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply