Collector | పోలియో చుక్కలు వేయించండి..

Collector | పోలియో చుక్కలు వేయించండి..
- పిల్లల భవిష్యత్ కాపాడండి
- కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
Collector | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే.బాలాజీ సూచించారు. మచిలీపట్నం మండలం చిలకలపూడిలోని పాండురంగ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,45,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇప్పటికే గ్రామాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు. చిన్నారులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యుగంధర్ కూడా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
