టెంకాయ @  50  

కార్తీక మాసం సందట్లో.. సిక్కోలు జిల్లాలో  యమ డిమాండు.. గురూ​ ..

ఆంధ్రప్రభ , లావేరు (శ్రీకాకుళం జిల్లా)

 కొబ్బరి పంట సంవత్సరం మొత్తం పండుతుంది. కొబ్బరికాయ లేకపోతే జీవనమే లేదు. సామానుడి  నుంచి  ధనికుడు వరకు దేవాలయాలకు వెళ్లాలన్నా ఇంటికి తెచ్చుకోవాలన్నా కొబ్బరికాయ అక్షరాల 50 రూపాయలే. గత నెలలో 30 రూపాయలు అమ్మే కొబ్బరికాయి ప్రస్తుతం 50 రూపాయలనేసరికి భక్తులు ఈ ధర ఏంటి రా అని తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో సుమారు 68 వేల హెక్టార్లలో కొప్పరి తోటలు ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. నిత్య పంట అయిన కొబ్బరి కార్తీకమాసం వచ్చేసరికి దేవాలయాలకు పెద్ద ఎత్తున భక్తులు కొబ్బరికాయలను తీసుకుని అభిషేకాలు చేసుకుంటారు. కార్తీకమాసం నుండి సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులు, భవానీలు ప్రతిరోజు కొబ్బరికాయతో దేవుడికి అభిషేకం చేస్తుంటారు. కార్తీక సోమవారాలు వచ్చాయంటే మరీ డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఆసుపత్రుల ముందు కూడా కొబ్బరి బొండాలు 50 రూపాయలకే వినియోగదారులకు అమ్ముతున్నారు. కొబ్బరి బొండం నీళ్లు రోగులకు మంచిదేనని వైద్యులు కూడా సూచనలు ఇవ్వడంతో కొబ్బరికాయలకు ఆ ధర పలుకుతుంది. ఇదే అదనని కొంతమంది దళారులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కొబ్బరి తోటలలోకి వెళ్లి కొబ్బరి పంటను అతి తక్కువకు కొన్ని మూడు రెట్లు లాభం పొందుతున్నారు. ఇక్కడ నష్టపోయేది కొబ్బరి పండించే రైతు, వినియోగదారుడే అని ప్రజలంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కొబ్బరికాయి ధర చాలా ఎక్కువగా ఉందన్న మాట నిజం.

Leave a Reply