సింగరేణిని అగ్రస్థానంలో నిలబెట్టాలి

సింగరేణిని అగ్రస్థానంలో నిలబెట్టాలి

  • క్రీడాకారులకు ఎస్ ఓ టు జి ఎం చంద్రశేఖర్ పిలుపు
  • గోదావరిఖనిలో ఏరియా వాలీబాల్ పోటీలు


గోదావరిఖని (ఆంధ్రప్రభ) : సింగరేణి (Singareni) క్రీడాకారులు తమ సత్తాను చాటుకోవాల్సిన సమయం వచ్చిందని, త్వరలోనే జరగబోయే కోల్ ఇండియా పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచి కంపెనీ పేరు నిలబెట్టాలని రామగుండం ఎస్ ఓటు జిఎం చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం గోదావరిఖని పట్టణంలోని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రామగుండం రీజియన్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ఎస్ ఓ టు జి ఎం చంద్రశేఖర్ ప్రారంభించారు.

క్రీడాకారుల పరిచయ కార్యక్రమం అనంతరం చంద్రశేఖర్ (Chandrasekhar) మాట్లాడుతూ… బొగ్గు ఉత్పత్తుల వెలికితీతలో ఎంతో బాధ్యతగా పనిచేస్తున్న సింగరేణి కార్మికులు క్రీడల్లో కూడా మన నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. బొగ్గు గాని కార్మికులకు క్రీడా సౌకర్యాలలో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు శిక్షణ పొంది పోటీల్లో తలపడుతున్న ప్రతి క్రీడాకారుడు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సింగరేణి క్రీడాకారులకు ఎస్ఓటు జిఎం చంద్రశేఖర్ ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ప్రసంగించారు.

ఏరియాల వారీగా జరుగుతున్న క్రీడా పోటీల్లో గెలుపొందిన టీం ఇల్లందులో జరగబోయే కంపెనీ లెవల్లో తలబడతారని అక్కడ అత్యంత ప్రతిపగల కనబరిచిన క్రీడాకారులను కోల్ బెల్ట్ (Coal Belt) వ్యాప్తంగా జరగబోయే క్రీడా పోటీలకు పంపడం జరుగుతుందని వివరించారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న బొగ్గు పరిశ్రమల నుండి ఎంపిక చేయబడిన క్రీడాకారుల బృందాలతో జరిగే పోటీల్లో సింగరేణి కీర్తి పతాకాన్ని ఎగరవేయాలని పేర్కొన్నారు. ఏరియా లెవెల్ పోటీల్లో ఆర్ జి-1టీం పై రామగుండం -2 జట్టు విజయం సాధించింది. వాలీబాల్ క్రీడా పోటీలు ఉత్సాహంగా హుషారుగా సాగాయి. ఈ కార్యక్రమంలో రామగుండం ఏరియాలోని సింగరేణి అధికారులు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply