CM Revanth Reddy | నవీన్‌ యాదవ్‌ను పరిచయం చేశా..

CM Revanth Reddy | నవీన్‌ యాదవ్‌ను పరిచయం చేశా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జూబ్లిహిల్స్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ యువ నాయకుడు నవీన్‌ యాదవ్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పరిచయం చేశానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

శనివారం వారంతా ఏఐసీసీలో కీలక నేతలను కలిశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.

CM Revanth Reddy

ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ”ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని మర్యాదపూర్వకంగా కలిశాం. జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన నవీన్‌ యాదవ్‌ను పరిచయం చేశాను. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, రోహిన్‌ రెడ్డి పాల్గొన్నారు.. అని తెలిపారు.

అంతకు ముందు రేవంత్‌ రెడ్డి టీమ్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిశారు. ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌కు ఈ సందర్భంగా రాహుల్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం కష్టపడిన నాయకులను అభినందించారు” అని సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

CM Revanth Reddy

మేడారం జాతరలో సమస్యలు తలెత్తొద్దు…

Leave a Reply