CM Revanth | సొంతింటి క‌ల‌ను సాకారం…

CM Revanth | సొంతింటి క‌ల‌ను సాకారం…

CM Revanth | జుక్కల్(కామారెడ్డి) ఆంధ్రప్రభ : పేదవారి సొంతింటి కలలు సాకారం చేసిన ఉక్కు మనిషి ఇందిరగాంధీ అని కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు(MLA Thota Lakshmikanta Rao) కొనియాడారు. భారతరత్న, భారత మాజీ ప్రధాని ఇందిరగాంధీ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

దేశ సమగ్రతకు, దేశ రక్షణ, పేదరిక నిర్మూలన కోసం ఇందిరా గాంధీ చేసిన కృషి మరువలేనిద‌ని ఆయన అన్నారు. ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని, ఇందిరమ్మ కన్న‌ కలలను తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy) సహకారం చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసి వారి సొంత ఇంటికలను సాకారం చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply