TG | అండర్‌-19 మహిళల జ‌ట్టుకు సీఎం రేవంత్ అభినంద‌న‌లు..

వరుసగా రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషని ప్రత్యేకంగా ప్రశంసించారు.

గొంగడి త్రిష లాంటి క్రీడాకారులు తెలంగాణ‌ రాష్ట్రానికి గర్వ కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మరింతగా రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యమున్న యువతీ యువకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు.

Leave a Reply