రాష్ట్రంలోనే రెండో బహుమతి

రాష్ట్రంలోనే రెండో బహుమతి
విద్యార్థిని అభినందించిన చైర్మన్
జన్నారం, ఆంధ్రప్రభ : రాష్ట్ర స్థాయిలో ఇటీవల నిర్వహించిన సీఎం కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర కరిమల జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న కొట్టె అభిషేక్ రెండో స్థానం పొందారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం కళాశాల ఆవరణలో ఆ విద్యా సంస్థల చైర్మన్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్ ఆ విద్యార్థికి శాలువా కప్పి సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈలాంటి కప్పులు మరెన్నో విద్యార్థులు గెలిచి కళాశాలకు, తల్లిదండ్రుకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆ విద్యా సంస్థల కరస్పాండెంట్ ఎర్ర సంపత్, కళాశాల ప్రిన్సిపాల్ ఎదులాపురం లక్ష్మణ్, డీన్ హేమలత షిండే, అధ్యాపకులు పాల్గొన్నారు.
