CM | కప్ క్రీడలు ప్రారంభం..

CM | నిజాంపేట, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాలలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చల్మెడ గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం అన్నారు. ఈ మేరకు చల్మెడ హైస్కూల్ లో ఈ రోజు సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవానికి ఎంపీడీవో రాజిరెడ్డి, ఎంఈఓయాదగిరి, ముఖ్య అతిధులు హాజరై క్రీడలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సీఎం కప్ 2025 సంబంధించి క్లస్టర్ లెవెల్ క్రీడ పోటీలను చల్మెడ, నందిగామ, నందగోకుల్, సంబంధించి కబడ్డీ, కోకో, వాలీబాల్, పోటీలు ప్రారంభమయ్యాయని ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు మండల స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు .

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ ఆకుల మహేందర్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ఉపాధ్యాయులు రామ్మోహన్, రాజయ్య, కార్యదర్శులు భాగ్యలక్ష్మి, యాదవ లక్ష్మి, పీటీలు ప్రవీణ్, లింగం, శ్రీనివాస్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply