BJP MLA Raja Singh: సీఎం రేవంత్ పై రాజాసింగ్ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో కొందరు పోలీసులు లంచాలు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారన్నారు.
పోలీసుల ఛాంబర్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని, కరీంనగర్ జమ్మికుంట సీఐ రవి కుమార్ ఒక బాధితుడి నుండి రూ.3 లక్షలు లంచం తీసుకున్నారన్నారు. గతంలో షాహినాజ్ గంజ్ పోలీసు స్టేషన్ సీఐ బాబు చౌహన్ ఒక వ్యక్తిని కేసు నుండి తప్పించడానికి లంచం అడిగారన్నారు.