ప్రశాంతంగా కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలు నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి, ఊట్కూర్ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారు. ఊట్కూర్ లో నిర్వహించిన పదవతరగతిపరీక్ష కేంద్రాలను మండల విద్యాశాఖ అధికారిణిమాధవి శనివారం తనిఖీ చేశారు.గణితంపరీక్షకు ఇద్దరు విద్యార్థులు గైరాజరైనట్లు తెలిపారు.

ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో128 మంది విద్యార్థులకు గాను ఒక విద్యార్థి గైరాజరుకాగా, బాలికల ఉన్నత పాఠశాలలో125 మంది విద్యార్థులకు గాను 124 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఇద్దరు విద్యార్థులు పరీక్షలకు గైరాజరయ్యారు.

పులిమామిడి కేజీవీబీలో 148 మంది విద్యార్థులు జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో 137 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల లో చీఫ్ సూపర్డెంట్లు సుధీర్, కిషోర్, నర్సిములు, సత్యనారాయణ, డిపార్ట్మెంటల్ అధికారులు మహేష్, భాస్కర్, అశోక్, మహేష్ లు విధులు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Leave a Reply