బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కాపుర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. ఏపిక్ మైథలాజికల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఎన్నో రామాయణ కథలు సినిమాలుగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇంకా మరెన్నో సినిమాలు వస్తూనే ఉంటయి. అందుకే రామాయణం ఎపిక్. ఇక ఇప్పడు లేటెస్ట్ గా బాలీవుడ్ లో రామాయణ ఇతిహాసంలో ‘రామాయణ’ అనే సినిమా వస్తుంది.
రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇక ఈ కథలో కీలకమైన రావణాసురిడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నాడు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతోంది. కానీ ఈ సినిమాకు సంబంధించి కనీసం ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. రణబీర్ రాముడు పాత్రలో నటిస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇన్ని రోజులు ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఎదుచూసిన మేకర్స్ చిన్న పాటి గ్లిమ్స్ తో వీడియో రిలీజ్ చేసారు. ఎవరెవరు ఏ ఏ పాత్రలు పోషిస్తున్నారో తెలియాజేస్తూ చివరిలో యష్ ను లుక్ ను చూపిస్తూ ఎండ్ లో రాముడుగా రణబీర్ ఎంట్రీ ఫ్రెమ్ ఓ రేంజ్ లో ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే రామయణ ఇంట్రడక్షన్ ఊహించిన దానికి మించి ఉండబోతుందని తెలుస్తోంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ టాప్ క్లాస్ ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ‘ రామాయణ’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. సెకండ్ పార్ట్ ను 2027 దీపావళికానుకగా రిలీజ్ చేస్తామని తెలిపారు.