Cine Awards | మీరే వచ్చి అవార్డులు తీసుకోవాలి !

  • గద్దర్ అవార్డులపై దిల్ రాజు వ్యాఖ్యలు వైరల్

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేడుక గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే, ఈ ఈవెంట్ ని ఉద్దేశిస్తూ FDC చైర్మన్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

స్టార్ హీరోల గైర్హాజరపై అసంతృప్తి!

జూన్ 14న జరిగిన ఈ అవార్డు వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, నిర్మాత దిల్ రాజు సహా అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే అవార్డు విజేతలైన కొంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ వేడుకకు రాకపోవడంపై దిల్ రాజు నేరుగా స్పందించారు.

గద్దర్ అవార్డుల కోసం ఆరు నెలలుగా పనిచేశాం. ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం. ప్రభుత్వ అవార్డులు వస్తే… అవార్డు గ్రహీతలే వచ్చి అవార్డు అందుకోవాలి. మూవీ షూటింగ్ ల‌ సాకుతో వేడుకకు రాకపోవడం సరికాదని అన్నారు.

Leave a Reply