మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి : లంచం తీసుకుంటూ డోర్నకల్ పోలీసు స్టేషన్‌కు చెందిన సీఐ భూక్యా రాజేష్, ఆయన గన్‌మేన్ గా విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ ధారావత్ రవి శనివారం ఏసీబీ అధికారులకు చిక్కారు.
ఒక కేసులో జప్తు చేసిన ఆస్తిపై క్లియరెన్స్ ఇవ్వడం కోసం రూ.50,000/- లంచం డిమాండ్ చేశారు. అందులో రూ.30,000/- లంచం తీసుకుంటుండుగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచ తీసుకుంటున్న సీఐ, కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.