చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని 26 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను గురువారం రెండవ రోజు నామినేషన్ల దాఖలు కొనసాగింది. వివిధ పార్టీల మద్దతుతో పాటు స్వతంత్రంగా పోటీ చేస్తున్న మొత్తం 36 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. అలాగే వార్డు సభ్యుల స్థానాలకు 1,085 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో సందీప్ కుమార్ తెలిపారు.
- మండలంలోని డి.నాగారం సర్పంచ్ స్థానానికి 4 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 24 మంది,
- కొయ్యలగూడెం సర్పంచ్ స్థానానికి 8 మంది, వార్డు స్థానాలకు 27 మంది,
- డి.మల్కాపురం సర్పంచ్ స్థానానికి 4 మంది, వార్డు స్థానాలకు 27 మంది
- పంతంగి సర్పంచ్ స్థానానికి 6 మంది, వార్డు స్థానాలకు 30 మంది
- నేళపట్ల సర్పంచ్ స్థానానికి 3 మంది, వార్డు స్థానాలకు 12 మంది
- చిన్నకొండూరు సర్పంచ్ స్థానానికి 3 మంది, వార్డు స్థానాలకు 36 మంది
- అంకిరెడ్డిగూడెం సర్పంచ్ స్థానానికి 8 మంది, వార్డు స్థానాలకు 31 మంది తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నామినేషన్ల స్వీకరణను క్లస్టర్ వారీగా ఎన్నికల అధికారులు నిర్వహించారు.
కాగా కోయ్యలగూడెం సర్పంచ్ స్థానానికి బిజెపి పార్టీ బలపరిచిన కైరం కొండ స్వప్న అశోక్ భారీ ర్యాలీగా వెళ్లి తమ నామినేషన్ ను దాఖలు చేశారు. అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

