మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..

చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మి,
ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు,

చిట్యాల, ఆంధ్రప్రభ : మహిళలు అన్ని రంగాల్లో రాణించి,ఆర్థికంగా బలోపేతం కావాలని,చిట్యాల గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి, అన్నారు. ఆదివారంమండల కేంద్రంలో శ్రీ గణేష్ గ్రామైక్య సంఘo ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ తౌటం లక్ష్మి, వార్డు సభ్యులు కోడెల శ్రీలత, అల్లం అనూష హాజరు అయ్యారు. వీవో అధ్యక్షురాలు కొక్కుల ఉమతో కలిసి కేక్ కట్ చేసి స్విట్లు పంపిణీ చేశారు. సీనియర్ సంఘం సభ్యులు బొల్లపెల్లి రాధమ్మ, సాదుల కనుకమ్మను సన్మానించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షిoచారు. ఈకార్యక్రమంలో వీవోఏ అకుల లత, వీవో ఓబీ లు చేరి సుజాత, పోతుగంటి సంధ్య, కోడెల సంధ్య, అన్ని సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply