Chittoor | బాధ్యతల స్వీకరణ

Chittoor | బాధ్యతల స్వీకరణ
- ఏఆర్ అడిషనల్ ఎస్పీగా దేవదాస్
Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఎం.దేవదాస్ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ తుషార్ డూడిను ఎస్‌పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేశారు. ఎం.దేవదాస్ 1991 బ్యాచ్‌లో రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో చేరారు. తొలి పోస్టింగ్‌గా చిత్తూరు ఏఆర్‌లో ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తించారు. అనంతరం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది తిరుపతిలో పని చేశారు. తదుపరి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి పొందిన ఆయన అనంతపురం శిక్షణ కేంద్రం, పీటీసీ కల్యాణి డ్యాం, చిత్తూరు తదితర ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.

2022లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఎం. దేవదాస్ ఏపీపీఏలో విధులు నిర్వహిస్తూ, తాజాగా బదిలీపై చిత్తూరు జిల్లా ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీగా నియమితులై ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏ.ఆర్ పోలీస్ అధికారులు, సిబ్బంది అడిషనల్ ఎస్పీ ఎం. దేవదాస్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో క్రమశిక్షణతో కూడిన పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
