చౌటుప్పల్ మున్సిపాలిటీలో పర్యటిస్తున్న చింతల వెంకటేశ్వర్ రెడ్డి..

చౌటుప్పల్ మున్సిపాలిటీలో పర్యటిస్తున్న చింతల వెంకటేశ్వర్ రెడ్డి..
- ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి..
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఈనెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 12, 20 తదితర వార్డులలో ఆయన ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు తుంగలో తొక్కిందని అన్నారు. మళ్ళీ ఆ పార్టీకి ఓటు వేయొద్దని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని కోరారు. తర్వాత రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాడూరి పరమేష్, అత్తర్ పాష, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, చౌటుప్పల పట్టణ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, పెద్దింటి బుచ్చిరెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ గోపనగోని లక్ష్మణ్ గౌడ్, ఖయ్యూం పాషా, రాము మున్నేరు, జమాల్, ముసిర్ తదితరులు పాల్గొన్నారు.

