బాలలను రక్షించి ఉజ్వల భవిష్యత్తునిద్దాం…

బాలలను రక్షించి ఉజ్వల భవిష్యత్తునిద్దాం…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : బాలలను రక్షించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని పెద్దజట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్ పిలుపునిచ్చారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలో ని పెద్ద జట్రం గ్రామంలో గ్రామస్థాయి బాలల సంక్షేమం రక్షణ కమిటీ విజన్ ఆర్గనైజర్ షాహిన్ అద్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు చేయాలని తల్లిదండ్రులు మరింత బాధ్యతగా వ్యవహరించాలన్నారు. బాలలను రక్షించి భావితరాలకు ఆదర్శంగా నిలుద్దామన్నారు.
నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు బాలల రక్షణకు కృషి చేయాలన్నారు. బాలల రక్షణ కమిటీ లో పంచాయతీ కార్యదర్శి భవిత, ఉప సర్పంచ్ స్వాతి పవన్ కుమార్, ప్రధానోపాధ్యాయులుగౌరమ్మ, గ్రామ పోలీస్ అధికారిదేవేందర్, ఆశ వర్కర్:- నరసమ్మ, సిఎంసి చైర్మన్, బాల అంజమ్మ, యూత్ ఆర్గనైజేషన్ :- గౌరీ శంకర్, పంచాయితీ మహిళాసభ్యులు రేణుక, గ్రామ పెద్దలువడ్ల రాములు, అంగన్వాడి టీచర్, భవాని తదితరులు పాల్గొన్నారు.
