ప్రగతి పదంలో బొమ్మసముద్రం…

ప్రగతి పదంలో బొమ్మసముద్రం…

ఐరాల, ఆంధ్రప్రభ : కోటి యాభై లక్షలతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఏంటో చేసి చూపిన కూటమి ప్రభుత్వం బొమ్మసముద్రం అభ్యున్నతిలో భాగస్వామ్యమైన ఎంపీ, ఎమ్మెల్యేలు అభివృద్ధి, సంక్షేమ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఐరాల మండలం, బొమ్మసముద్రం ప్రగతి పథంలో దూసుకెళుతోంది. కోటి యాభై లక్షలతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేసి, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపింది కూటమి ప్రభుత్వం.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ బొమ్మసముద్రం సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని నిరూపించారు. ఇందులో ముఖ్యంగా బొమ్మసముద్రం పంచాయతీలోని తిమ్మోజిపల్లి, బొమ్మసముద్రం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్లు, చెరువు మొరవ కల్వర్టుల మరమ్మతులు , ఆరోగ్య కేంద్రం, ఎంపిపి పాఠశాల ప్రహరీ గోడ, నూతన పాఠశాల భవనాలు, సిమెంట్ రోడ్లు, బొమ్మసముద్రంలో దళితవాడలో నిర్మించిన కమ్యూనిటీ హాళ్ళను, ఆదివారం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు.

అంతకు ముందు బొమ్మసముద్రం పంచాయతీకి చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు కాణిపాకం ఆలయం పాలకమండలి చైర్మన్ మణినాయుడు, టిడిపి సీనియర్ నేత గిరి నాయుడు,ఐరాల మండలాధ్యక్షులు హరిబాబు నాయుడు నేతృతంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బాణా సంచా పేలుస్తూ మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. బొమ్మసముద్రం గ్రామ పంచాయతీలో అడుగడుగునా ఎంపీ, ఎమ్మెల్యేలకు కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు.

ఈ సందర్భంగా అక్కడే నూతనంగా ఏర్పాటు ఎన్టీఆర్ కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్, టిడిపి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, మాజీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, ఐరాల జట్పిటిసి సుచిత్ర, తవణం పల్లె మండలాధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, బంగారు పాళెం టిడిపి మండలాధ్యక్షులు ధరణి ప్రసాద్, బొమ్మసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ రఘు,ఐరాల మాజీ జట్పిటిసి లతమ్మ, యాదమర్రి మండలాధ్యక్షులు, బంగారు పాళెం ఏయంసి చైర్మన్ భాస్కర్ నాయుడు, టిడిపి నాయకులు చొప్పా నాని తదితరులతో కలిసి తారక రాముడికి ఘన నివాళులర్పించారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ప్రజలు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. అభివృద్ధి పనులన్నీ పూర్తి కావడంతో బొమ్మసముద్రం పంచాయతీ ఓ మోడల్ పంచాయతీగా పచ్చదనానికి మారుపేరుగా రూపాంతరం చెందడం ఆనందంగా ఉందన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని తాము చేసి చూపమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు ప్రోత్సాహంతో పూతలపట్టు నియోజకవర్గం అన్ని రకాల ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు.

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభ్యున్నతిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు, పని కట్టుకొని పని చేసే సర్కార్ పై బురద జల్లడం సరికాదని హితవు పలికిన ఎంపీ ఎమ్మెల్యేలు బొమ్మసముద్రం పంచాయతీలో జరిగిన అభివృద్ధిని చూస్తే మా చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందన్నారు.

Leave a Reply