ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్ డివిజన్ గిర్మాపూర్ లో చత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ పరాక్రమానికి ధైర్య సాహసాలకు నిలువుటద్దం స్వరాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ అని తెలిపారు. మేడ్చల్ డివిజన్ గిర్మాపూర్ లో రాఘవ రెడ్డి అధ్యక్షతన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, హనుమంత్ రెడ్డి, రాజి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, భూపాల్ రెడ్డి, బాల్ రెడ్డి, సత్య వేణు, మల్లా రెడ్డి, ఎల్ఐసి చారి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ రెడ్డి, విష్ణు గౌడ్, సురేందర్ రెడ్డి, వెంకటేష్, మురళీ, చంద్రశేఖర్, ఆంజనేయులు గౌడ్, మహేష్, సందీప్ రెడ్డి, రాగం ఆనంద్, కార్తీక్ రెడ్డి, ప్రవీణ్, దాసు, నరేష్, పవన్, నాని, ప్రశాంత్ తదితరులు ఉన్నారు..
