CSK vs MI | చెన్నై బౌలర్ల జోరు.. ముంబై వరుస వికెట్లు డౌన్ !

చిదందరామ్ స్టేడియంలో చెన్నైతో జ‌రుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మ‌ద్ వేసిన 11 ఓవర్లో కెప్టెన్ సూర్య కుమార్ (29) ప‌రుగుల‌కు ఔట‌య్యాడు. ఆ తరువాత 12.4 వ ఓవర్ నూర్ అహ్మ‌ద్ బౌలింగ్ లో రాబిన్ మింజ్ (3) క్యాచ్ ఔటవ్వగా.. అదే ఓవర్లో తిలక్ వ‌ర్మ (30) ఎల్బీడబ్లూ గా వెనుదిరిగాడు.

కాగా, ప్ర‌స్తుతం క్రీజులో నమన్ ధీర్ – మిచెల్ శాంట్నర్ ఉన్నారు. 13 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోర్ 96/6

అంత‌క‌ముందు ఖలీల్ అహ్మద్ వేసిన‌ తొలి ఓవ‌ర్ నాలుగో బంతికి రోహిత్ శ‌ర్మ డ‌కౌట్ గా వెనుదిర‌గ‌గా.. రెండో ఓవ‌ర్లో ర్యాన్ రికెల్టన్ (13) ప‌రుగుల‌కు ఔట‌య్యాడు. ఇక అశ్విన వేసిన 4.4 ఓవర్లో విల్ జాక్స్ (11) పెవిలియన చేరాడు. దాంతో 4.4 ఓవ‌ర్ల‌లోనే ముంబై జ‌ట్టు 36 ప‌రుగుల‌కు మూడు వికెట్లు కోల్పోయింది.

Leave a Reply