శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం.

శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం.

ఆకట్టుకున్న అడుగులభజన చెక్కభజన పోటీలు..

ఊట్కూర్,ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఓబులపూర్, లో శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. శుక్రవారం శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా కళ్యాణోత్సవం తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలిరాగా పురోహితులవేదమంత్రోచరణ మధ్య కళ్యాణం నిర్వహించగా యువకులు, విద్యార్థులు ఆడిన అడుగులచెక్కభజన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

సీతారాముల ఉత్సాహ విగ్రహాలను గ్రామ పురవీధులు గుండా ఊరేగిస్తూ దేవాలయానికి చేరుకొని కళ్యాణం కళ్యాణం అత్యంత వైభవంగా చేపట్టారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడుసీతమ్మ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమనిఅన్నారు.

ఆదర్శప్రాయుడు రాముడిని కొలిచిన వారికి కష్టాలు తొలగి సుఖశాంతులతో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హన్మంతు,గోపాల్ గౌడ్,శశికాంత్ రెడ్డి మాజీ సర్పంచ్ భీమ్ రెడ్డి,బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, నాయకులు భీమకవి రెడ్డి గోవర్ధన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply