Chandrababu | విజనరీ ప్రసంగం – గ్లోబల్ ఇన్వెస్టర్ల ఫిదా..

Chandrababu | విజనరీ ప్రసంగం – గ్లోబల్ ఇన్వెస్టర్ల ఫిదా..
Chandrababu, శ్రీకాళహస్తి, ఆంధ్రప్రభ : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ – 2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర బృందం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రితో కలిసి పాల్గొంటున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, అక్కడ జరుగుతున్న పరిణామాల పై హర్షం వ్యక్తం చేశారు.
సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనే అంశం పై ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం సదస్సుకే హైలైట్‌గా నిలిచిందని ఎమ్మెల్యే బొజ్జల పేర్కొన్నారు. ఏపీలోని సహజ వనరులు, సుదీర్ఘ తీరప్రాంతం, ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక రాయితీలను సీఎం వివరించిన తీరు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకర్షించిందని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే సీఎం పట్టుదలను, నిరంతర తపనను నేను దగ్గరుండి గమనిస్తున్నాను. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న శ్రమ స్ఫూర్తిదాయకం. లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ఐటీ, ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్ రంగాలలో ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు విజనరీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా అవతరించబోతోంది. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు రావడం ఖాయం అన్నారు.
ముఖ్య విశేషాలు:
దావోస్ సదస్సులో ఏపీ ప్రత్యేక పెవిలియన్ ద్వారా రాష్ట్ర ప్రగతిని ప్రదర్శిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బొజ్జల ఇతర మంత్రుల బృందం కీలక చర్చలు జరుపుతోంది. నైపుణ్యం కలిగిన యువత, మెరుగైన మౌలిక సదుపాయాలే ఏపీ బలమని ప్రపంచ వేదిక పై చాటిచెబుతున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో సీఎం చంద్రబాబు ఆలోచనలను, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవను నియోజక వర్గ ప్రజలు అభినందిస్తున్నారు.

