Eluru | కిడ్నీ బాధితురాలి ఇంటికి ..
ఏలూరు/ఉంగుటూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపీనాథపట్నం గ్రామంలో కిడ్నీ బాధిత మహిళ గుడ్ల నాగలక్ష్మీకి పింఛను అందించారు. తమ ఇంటికి ముఖ్యమంత్రి వస్తున్నారన్న సమాచారంతో నాగలక్ష్మీ కొడుకు, కుమార్తె నాగపవన్, వాసవి చంద్రబాబుకు ఎదురెళ్లి స్వాగతం పలికారు.
నాగ పవన్, వాసవి చదువు వివరాలను గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న నాగలక్ష్మీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలసుకున్న సీఎం నాగలక్ష్మి కి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్‌కు సూచించారు. నాగలక్ష్మీ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.





