Challapally | నిరుపేదకు అండగా..

Challapally | చల్లపల్లి, ఆంధ్రప్రభ : టపాసులు పేల్చుతూ కంటికి తీవ్రగాయమై కంటి చూపు కోల్పోయిన నిరుపేద యువకునికి దాతలు సహాయం చేశారు. చల్లపల్లి ఒకటో వార్డ్ ఎస్సీ కాలనీ చెందిన కొడాలి రంజిత్ ఇటీవల టపాకాయలు కాల్చుతూ ప్రమాదానికి గురై కంటి చూపు కోల్పోయాడు. అవనిగడ్డ నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ యువకుడిని పరామర్శించి ప్రమాదం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీఎంఐ డైరెక్టర్ కనగాల ఇమ్మానియేల్ మోజెస్, జనసేన నేత అడపా రాంబాబు చెరొక రూ.10వేల చొప్పున రూ.20 వేలను మండలి వెంకట్రామ్ చేతుల మీదుగా బాధితునికి అందచేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పైడి పాముల కృష్ణకుమారి, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి లంకె యుగంధర్, ఎంపీపీ కోట విజయరాధిక, పీఏసీఎస్ ఛైర్మన్ బొందలపాటి వీరబాబు, మాజీ ఎంపీటీసీ కొడాలి మురళి, విశ్రాంత ఏఈ శరాబంది, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చోడగం విమల్ కృష్ణ, వార్డు సభ్యురాలు కొడాలి రోహిణి, కూటమి నేతలు బాధర్ల లోలాక్షుడు, తోట మురళీకృష్ణ, మెరకనపల్లి నరేష్, రావి చంద్రశేఖర్ (చిట్టి), అనుమకొండ పూర్ణ చంద్రశేఖరరావు (ప్రెస్ పూర్ణ), గంగిశెట్టి బాబూ రాజేంద్ర, ముఖర్జీ, ఏలియా తదితరులు పాల్గొన్నారు.
