రేపు చైతన్య కళా సమాఖ్య నాటిక పోటీలు ప్రారంభం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ ; 14వ జాతీయస్థాయి తెలుగు ఆహ్వానిత నాటిక పోటీలు సోమవారం సాయంత్రం నుండి నిర్వహించనున్నట్లు చైతన్య కళా సమాఖ్య అధ్యక్షులు మన్నూరు ఉమా తదితరులు తెలిపారు. ఆదివారం ఈ నాటిక పోటీల ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ఈ సంవత్సరం కూడా మార్చి 9, 10, 11, 12, 13 తేదీలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి తమ ప్రతిభను ప్రదర్శించే కళాకారులకు తమ వేదిక ప్రోత్సహిస్తుందని కళాభవిషకులు కళా రాధకులు ప్రేక్షకులు ఈ ఐదు రోజులపాటు అధిక సంఖ్యలో విచ్చేసి నాటికలు తిలకించి విజయవంతం చేయాలని చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ అసోసియేటెడ్ ప్రెసిడెంట్ మంగళంపల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సుంకరనేని పినాకపాణి, లేగల వెంకట్ రెడ్డి ,బుదారపు శ్రీనివాస్, ఇమ్మడి రాంబాబు, మాచర్ల వెంకన్న పెరమండ రవి గౌడ్ రామగిరి భాస్కరాచారి పాల్గొన్నారు.
