గురువును కోల్పోయిన బాధతో చైర్మన్ కంటతడి..

గురువును కోల్పోయిన బాధతో చైర్మన్ కంటతడి..

  • నా మార్గదర్శకుడు లేరంటూ అంటూ భావోద్వేగానికి లోనైన చైర్మన్
    – నరేందర్ రెడ్డి లేకపోవడం తీరని లోటని చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ఆవేదన

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని ఎస్ కన్వెన్షన్‌లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతకుంట్ల నరేందర్ రెడ్డి సంతాప సభ శుక్రవారం భావో ద్వేగ వాతావరణంలో నిర్వహించారు. సభ ప్రాంగణం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లా, మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కన్నీటి నివాళులు అర్పించారు. సభలో మున్సిపల్ చైర్మన్ తాటి కొండ వినయ్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయ జీవితంలో తనకు మార్గదర్శకుడిగా నిలిచిన గురువు ఇక లేరనే ఆవేదనతో కంటతడి పెట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి చైర్మన్ వినయ్ కుమార్‌ను ఒదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం చైర్మన్ మాట్లాడారు. నాకు రాజకీయంగా జీవం పోసిన నాయకుడు ఆయన.. ప్రతి అడుగులో మార్గనిర్దేశం చేసిన వ్యక్తి ఇక లేరనే విషయం నమ్మలేక పోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాటలు సభలో ఉన్న వారిని కదిలించాయి. నరేందర్ రెడ్డి సాధారణ నాయకుడు కాదు. ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన సేవామూర్తి అని గుర్తు చేసుకున్నారు. ఆయన చూపిన మార్గం, విలువలు ఎప్పటికీ తమకు దారి చూపుతాయని తెలిపారు. ఆయన లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి మాత్ర మే కాదు.. ఘన్ పూర్ ప్రజలకు కూడా తీరని లోటని పేర్కొన్నారు. సభలో రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave a Reply