Celebrations | ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు

Celebrations | కోడూరు, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలు కోడూరులో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కోడూరు మండల టీడీపీ అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోడూరు వంతెన సెంటర్లో టీడీపీ శ్రేణులు భారీ టపాసులు కాల్చి కేక్ కట్ చేసి, లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా, పార్టీ నేతగా నారా లోకేశ్ చేసిన అభివృద్ధి పనులను, పార్టీ శ్రేణులకు భరోసాగా నిలిచిన రూ. 5 లక్షల భీమా వంటి అంశాలను గూర్చి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
