Celebrations |సాయి అనాధాశ్రమంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు..

Celebrations |సాయి అనాధాశ్రమంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు..

Celebrations | భీమారం, ఆంధ్ర ప్రభః తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 72వ జన్మదిన వేడుకలు బి.ఆర్.ఎస్ పార్టీ యూత్ నాయకుల ఆధ్వర్యంలో పూరిగుట్ట ప్రాంతంలో గల సాయి సేవ ట్రస్ట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 55 డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై కేసీఆర్ జన్మదిన కేకును విద్యార్థులు తో కలిసి కట్ చేశారు. అనంతరం వారికి పుస్తకాలు, పెన్నులు, పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply