పుట్ట‌ప‌ర్తి ఆధ్యాత్మిక కేంద్రం

పుట్ట‌ప‌ర్తి ఆధ్యాత్మిక కేంద్రం

పుట్ట‌ప‌ర్తిలో రూ. 1. 39 కోట్ల వ్యయంతో సీసీ, డ్రోన్ కెమెరాలు
ప‌నులు ప్రారంభించిన ఎస్పీ స‌తీష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి అక్టోబరు 12 ఆంధ్రప్రభ : పుట్ట‌ప‌ర్తి పది కిలోమీటర్ల చుట్టూ రూ.139కోట్ల వ్య‌యంతో సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేక డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆదివారం పుట్టపర్తి పట్టణంలోని ఎనుములపల్లి గణేష్ సర్కిల్ వద్ద డ్రోన్ కెమెరాల ఏర్పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఎస్పీ సతీష్ కుమార్, సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్, మాజీ మంత్రిపల్లె రఘునాథ్ రెడ్డిలు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రానికి ప్రముఖుల రాకను దృష్టిలో ఉంచుకొని కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులతో పాటు రాష్ట్రపతి, ప్రధాని మోదీ ముఖ్యమంత్రి ఇతర మంత్రుల రాకను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ తో పాటు జనసమూహాన్ని నివారించడంతోపాటు సాఫీగా సాగేందుకు నిఘానేత్రాలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పుట్టపర్తి పట్టణానికి విచ్చేసే రహదారులతోపాటు కూడళ్లలో దాదాపు 216 సీసీ కెమెరాలతో పాటు చీకటిలో కూడా అద్భుతంగా పనిచేసే కెమెరాలు, ప్రత్యేక డ్రోన్ కెమెరాలను అమర్చుతున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు వాహనాలు నిలుపుటకు పార్కింగ్ స్థలాలతో పాటు వారు బస చేసేందుకు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2016 కేంద్రాల్లో 160 కెమెరాలు 47 అత్యద్భుత కెమెరాలు ప్రశాంతి నిలయంలో కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.

రాత్రిపూట నిశితంగా పరిశీలించే డ్రోన్ కెమెరాలను దాదాపు పది లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వీటన్నింటిని పరిశీలించడానికి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కోణాలో్ల‌ పరిశీలించి విదేశీయులతోపాటు భక్తులు విఐపీల రాకను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. పీపీపీ పథకం ద్వారా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌తో పాటు స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూర రెడ్డి, మాజీమంత్రి రఘునాథ్ రెడ్డి ఆర్థిక సహాయంతో కెమెరాల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply