CC Road | అవకాశమిస్తే.. అభివృద్ధి చేస్తా..

CC Road | అవకాశమిస్తే.. అభివృద్ధి చేస్తా..

  • గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి నీరజ సతీష్ రెడ్డి

CC Road | గొల్లపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : గొల్లపల్లి పట్టణ సర్పంచ్ అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి(Neeraj Satish Reddy) ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిరోజూ ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరును కలిసి మద్దతు తెలుపాలని కోరుతున్నారు. అవకాశమిస్తే గొల్లపెల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు.

మరీముఖ్యంగా మంచినీటి సౌకర్యం కల్పిస్తానన్నారు. గ్రామంలో వాడవాడకు సీసీ రోడ్(CC Road, డ్రైనేజీ నిర్మిస్తానని సతీష్ రెడ్డి హామీ ఇచ్చారు. గొల్లపల్లి ప్రజలు నల్ల నీరజ సతీష్ రెడ్డికే పట్టం కట్టనున్నారు.

Leave a Reply